ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ యన్టీఆర్ గా నటిస్తున్న చిత్రం.. యన్టీఆర్. బాలకృష్ణతో కలసి సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చంద్రబాబు నాయుడిగా దగ్గుబాటి రాణా, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి, యన్టీఆర్ సతీమణి బసవతారకంగా విద్యా బాలన్, అక్కినేని నాగేశ్వరరావుగా ప్రముఖ నటుడు సుమంత్ నటిస్తున్న యన్టీఆర్ బయోపిక్ లో విజయవాడ అమ్మాయి హిమన్సీ కూడా కీలకపాత్ర పోషిస్తోంది.
దగ్గుపాటి పురందేశ్వరి మొదట్లో టిడిపిలో ఉండి ఆ పార్టీలో నచ్చక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది అప్పటినుండి ఓటమి ఎరుగని నాయకురాలుగా ఉంది. తర్వాత కొన్ని కారణాలవల్ల ఆ పార్టీని కూడా వదలవలసిన పరిస్థితి వచ్చింది. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న మూవీ లో దగ్గుపాటి పురందేశ్వరి గా హిమన్సీ న్నుకోవడం జరిగింది.
డ్యాన్సర్ అయిన హిమన్సీ.. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి పాత్రలో నటించనుందని తెలుస్తోంది. ఈ మేరకు హిమన్సీ.. పురందేశ్వరితో కలసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ పొటోలో అచ్చం పురందేశ్వరిలానే అలంకరించుకున్న హిమన్సీని చూసి పురందేశ్వరి తెగ ముచ్చటపడిపోయారు. తన పాత్ర చేయనున్న హిమన్సీని పురందేశ్వరి తదేకంగా చూస్తుండిపోయారు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న యన్టీఆర్ మూవీకి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా, ఎస్వీ రంగారావు పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబును సంప్రదించగా ఆయన తిరస్కరించినట్టు తెలుస్తోంది. అదేవిదంగా మహానటి సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ నటించనుందని సమాచారం.
ఎన్టీఆర్ మొదట్లో ఏ ఇంట్లో అయితే నివసించారు అదే ఇంట్లో విచిత్ర సన్నివేశాలు నో చిత్రీకరిస్తున్నారు. అప్పట్లో ఆ ఎన్టీఆర్ తో ఎటువంటి అనుబంధం ఉంది అలాంటి పాత్రను బాలకృష్ణ ద్వారా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు బాలకృష్ణ ని ప్రొడ్యూసర్ గా ఉన్నారు దీన్ని ఎన్.బి.కె ఫిలిమ్స్ పై నిర్మిస్తున్నారు
Author:Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి