Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
ప్రీమియమ్ విభాగంలో రారాజు అయిన వన్ ప్లస్ 6 స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో ఏ స్థాయిలో రికార్డు నెలకొల్పిందే అందరికి తెలిసిందే. అప్పటి వరకు ప్రీమియమ్ విభాగంలో నెంబర్ వన్ గా ఉన్న శాంసంగ్, ఆపిల్ ను వెనక్కి నెట్టి వన్ ప్లస్ కంపెనీని అగ్రస్థానానా చేర్చింది. అయితే వన్ ప్లస్ 6కు కొనసాగింపుగా ఇటీవల కంపెనీ వన్ ప్లస్ 6 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉండగా, ఈ ఫోన్ సైతం అమ్మకాల్లో రికార్డులు నెలకొల్పుతోంది. అయితే వన్ ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్ ఒక అరుదైన ఘనతను సాధిచింది.
నవంబర్ ఒకటో తేదీన ఇండియాలో వన్‌ప్లస్‌ 6టీ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ కాగా, తొలుత అమెజాన్, వన్ ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్స్‌ లో అందుబాటులో ఉంచారు. నవంబర్ మూడో తేదీ నుంచి రిలయన్స్ డిజిటల్‌ సహా వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్లు, క్రోమా స్టోర్స్‌ లోనూ వన్‌ప్లస్ 6టీ లభ‍్యం కానుంది.
అయితే అమెజాన్‌లో వన్ ప్లస్‌ 6టీ స్మార్ట్‌ ఫోన్‌ని ఆర్డర్‌ చేసిన వందలాది మంది వన్‌ప్లస్‌ కమ్యూనిటీ మెంబర్స్‌ ని ముంబైలోని ‘రిచర్డ్సన్‌ అండ్‌ క్రుడ్డాస్‌’కు రావాల్సిందిగా వన్‌ప్లస్‌ అధికారులు కోరారు. ఇలా దాదాపు 559 మంది ఇక్కడకు చేరుకున్నారు. వీరందరికి ఒకేసారి.. ఒకే వేదిక మీద వన్ ప్లస్ 6టీ ఫోన్‌ని డెలివరీ చేసింది అమెజాన్‌. ఫోన్‌ని అందుకున్న వారంతా ఒకేసారి దాన్ని అన్‌బాక్స్‌ చేశారు. ఇంతవరకూ ప్రపంచంలో ఇంత మంది ఒకే వేదిక మీద.. ఒకేసారి ఒకే మోడల్‌ ఫోన్‌ని అన్‌బాక్స్‌ చేయలేదు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి మొబైల్‌గా వన్‌ప్లస్‌ 6టీ రికార్డ్‌ సృష్టించి.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులోకెక్కింది.
ఫీచర్లు6.41 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్6 జీబీ /8 జీబీ ర్యామ్128 జీబీ/256 జీబీ స్టోరేజ్ఆండ్రాయిడ్ 9.0పైడ్యుయల్ సిమ్16 మెగాపిక్సల్, 20 మెగాపిక్సల్ రెండు బ్యాక్ కెమెరాలు16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్వాటర్ రెసిస్టెంట్3700 ఎంఏహెచ్ బ్యాటరీధరలు6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. రూ.37,9998 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.
41,9998 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.45,999వన్ ప్లస్ 6 టీ స్మార్ట్ ఫోన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియజేయగలరు. అంతేకాకుండా లేటెస్ట్ టెక్నాలజీ న్యూస్, స్మార్ట్ ఫోన్ల లాంచింగ్, స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు, రివ్యూలు వేగంగా తెలుసుకోవాలంటే యెల్లో కలర్ లో ఉన్న ఫాలో బటన్ ను ప్రెస్ చేయగలరు.
Author:Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.