Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
సాధరణంగా మన శరీరం మీద పుట్టు మచ్చలు ఉండటం సహజం. ప్రతి ఒక్కరి శరీరం మీద ఏదో ఒక ప్రదేశంలో పుట్టుమచ్చ ఉండటం సహజం. కొంత మందికి ఎక్కవ భాగాల్లో పుట్టుమచ్చలు ఉంటాయి. కొన్ని పుట్టుమచ్చలు పుట్టుకతో వస్తాయి, మరి కొందరిలో పెరుగుతున్న సమయంలో కూడా పుట్టుమచ్చలు ఏర్పడతాయి. పుట్టుకతో వచ్చే మచ్చలను మాత్రమే కాదు మధ్యలో ఏర్పడిన మచ్చలను కూడా పుట్టు మచ్చలగానే వ్యవహరిస్తారు. అయితే ఈ పుట్టు మచ్చలకు సంబందించి ఒక శాస్త్రమే ఉంది. అదే పుట్టుమచ్చ శాస్త్రం.
పుట్టుమచ్చల వలన కలిగే ఫలితాల గురించి ఆ శాస్త్రంలో చెప్పడం జరిగింది. శరీరం మీద ఏ భాగంలో పుట్టుమచ్చ ఉండటం మంచిది, దాని వలన కలిగే మంచి, చెడుల గురించి చాలా మంది జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అవి ఎంత వరకూ నిజం అనేది పక్కన పెడితే, పుట్టుమచ్చల గురించి పండితులు చెబుతున్న విషయాలను ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది.
కుడి కన్నుపై గనుక పుట్టుమచ్చ ఉంటే తుది శ్వాస వరకు జీవిత భాగస్వామితో ప్రేమలో ఉంటారని అర్థం. అలాగే ఎడమ కన్ను పై భాగంలో ఉంటే లక్ష్య సాధన కోసం వీరు చాలా కష్టపడాలని అర్థం. కుడి చెంపపై పుట్టుమచ్చ ఉంటే ఆరోగ్యవంతులని అర్థం, ఎడమ చెంప పై ఉంటే ధన నష్టం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం. పెదాలపై పుట్టుమచ్చ ఉంటే వీరికి లైంగిక కోరికలు అధికమని అర్థం. మెడ భాగంలో మచ్చ ఉంటే వీరు సంపదతో కూడిన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అర్థం. అంతేకాకుండా, వీరి జీవిత కాలం కూడా అధికంగా ఉంటుందని అర్థం.
ముక్కుపైన గనుక పుట్టుమచ్చ ఉంటే వీరు చాలా ప్రయాణాలు చేస్తారు. మాములుగా భుజముపైన వుంటే బాధను పొందుతారు. ఎడమ భుజముపైన వుంటే జగడములాడుతారు. కుడిచేతిపైన గానీ, కుడి భుజముపైన గానీ వుంటే వీరు బుద్ధిమంతులు, దూరదృష్టి గలవారవుతారు. చంకకు, గుండెకు దగ్గరగా వున్నట్లైతే వీరు ధనవంతులు, గౌరవనీయలవుతారు. ఒకవేళ చేతిమీద ఉంటే ఐశ్వర్యం గల పిల్లల వలన వీరు సుఖమును పొందుతారు. కుడి రొమ్ముపైన వుంటే మంచి తెలివితేటలు కలవారై ఉండటారు అలాగే కష్టపడి పనిచేస్తారు అని అర్థం.
Author: Mahalakshmi
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.