Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
ఆరడుగులకు పైగా హైటు,హీరోకి సరిపడా శరీర ధారుడ్యం అన్ని సమపాళ్లలో ఉన్న ఈ ప్రభాస్ కి మొదటి సినిమాతోనే నిర్మాతలు చూపు ప్రభాస్ పై పడింది.2002 'రాఘవేంద్ర 'సినిమాతో ముందుకొచ్చాడు ఈ సినిమాలో ఎక్కువగా కష్టం రాజుని ఇమిటేట్ చేయటం వల్ల కథ బాగున్నా సినిమా ప్లాప్ అయింది.ఇక అప్పటినుంచి తనకంటూ సొంతంగా ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవటానికి తపించాడు.సినిమా షూటింగ్లో తన నటన బాగుందా మరో టేక్ చేద్దామా అని ప్రతి ఒక్కరు ని అడిగి,పెద్ద నటుల సలహాలు తీసుకొని తన నటన మరింత మెరుగుపరచుకున్నారు.2004 లో వర్షం సినిమా తో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
అతరువాత అడివిరాముడు, చక్రం సినిమాలు విడుదలయ్యాయి ఆ సినిమాలు విజయం సాధించకపోయినా ప్రభాస్ మంచి నటుడిగా నిరూపించుకున్నాడు,ఇక 2005లో వచ్చిన చత్రపతి సినిమాతో అగ్ర హీరోగా మారిపోయాడు.ఆ తర్వాత పౌర్ణమి,యోగి,మున్న,బుజ్జిగాడు,బిల్లా,ఏక్ నిరంజన్ సినిమాలు చేశారు.వీటిలో కొన్ని కమర్షియల్ గా విజయం సాధించినా కొన్ని పరాజయం పాలయ్యాయి.ఏక్ నిరంజన్ సినిమా పరాజయంతో తన పంధా నీ మరోసారి మార్చుకున్నాడు,తను అప్పటి వరకు మాస్ కే దగ్గర అవటం వల్ల ఆ తరువాత నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులకి దగ్గరవటానికి ప్రయత్నించారు.
డార్లింగ్ సినిమా విజయం తో అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆ వెంటనే మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమా తో అతి పెద్ద విజయం అందుకున్నారు. మరోసారి మాస్ టచ్ తో రెబల్ సినిమా విడుదల చేసి పరాజయం పొందాడు.మరోసారి అన్ని సమపాళ్లలో ఉండాలి అని 'మిర్చి' సినిమాతో ముందుకొచ్చాడు. మిర్చి సినిమా తో అప్పటివరకు ఉన్న తన కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు.అప్పటి వరకు సౌత్ సినిమాల హీరో గానే పరిమితమైన ప్రభాస్,బాహుబలి వన్ సినిమాతో ఒక్కసారిగా ఇండియా స్టార్ అయిపోయారు.ఇక బాహుబలి2 సినిమా తో ఏకంగా ప్రపంచంలోని సగం మంది జనాలకి చేరువయ్యాడు.దాదాపు రెండు వేల కోట్లు సాధించిన ఈ సినిమా ఇండియాలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల రికార్డులన్నీ తిరగరాసింది.ఇండియాలో ఉన్న అందరి హీరోల కంటే కూడా ప్రత్యేకమైన హీరో గా మార్చేసింది.
దాదాపు మూడు వందల కోట్ల మంది ఈ సినిమా గురించి చర్చించుకున్నారు అంటే అతిశయోక్తి కాదు.ఒక ప్రాంతీయ సినిమా,అందులో ఒక తెలుగు సినిమా ప్రపంచం మొత్తం తెలియజేయటం, అందులో మన ప్రభాస్ హీరో కావటం తెలుగు సినిమా అభిమానులకు గర్వ కారణమే.. ఇక రాబోయే ప్రభాస్ నటించిన సినిమా 'సాహో' చిత్రం కోసం ఇండియా మాత్రమే కాదు ప్రపంచం లోని చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయి అంటే ప్రభాస్ మానియా ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక ఈ సాహో సినిమాతో తెలుగు సినిమాని మరో మెట్టు ఎక్కించాలని కోరుకుంటూ ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.అంతేకాదు ప్రభాస్ కూడా అతి త్వరలో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కావాలని కూడా కోరుకుందాం, ఆగండాగండి 2019లోనే ఆ కోరిక తీరుతుందని విశ్వసనీయ సమాచారం....
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.