Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
రజనీకాంత్‌ నటిస్తున్న,కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలోని ‘పేట’ చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇటీవలే చెన్నై వచ్చిన విషయం తెలిసిందే. సినిమాలతో, ఇంకో వైపు పార్టీ కి సంబంధించిన పనులతో బిజీగా ఉన్న రజనీ, మరో వైపు కుటుంబ సభ్యులతోనూ కాలక్షేపం చేస్తున్నారు. పోయెస్‌ గార్డెన్‌లోని ఇంట్లో మనవళ్లతో కలిసి సందడి చేస్తూ ఆడుకొంటుండగా .
ఆటోలో షికారుకు వెళదామని మనవడు వేద్‌కృష్ణ అడిగారట,మనవడి కోరికను కాదనకుండా తన డ్రైవర్ తో ఓ ఆటోను పిలిపించి,అందులో తన మనవడిని కూర్చోబెట్టుకొని,ముందుగా పోయెస్ గార్డెన్ నుంచి ఆల్వార్ పేట మౌంట్ రోడ్డు వీధులు చుట్టి వచ్చిన అనంతరం ధనుష్ ఇంట్లో తన మనవడిని దిగబెట్టి కార్ లొ తన ఇంటికి చేరుకున్నారట.
రజనీ ఆటోలో వెళ్తున్నప్పుడు పలువురు నగర ప్రజలు గుర్తుపట్టి అభివాదం చేశారట,రజనీ కూడా వారికి నమస్కరించుకుంటూ,అభివాదం చేసుకుంటూ పోయెస్‌గార్డెన్‌ ఇంటికి తిరిగొచ్చారట.షూటింగులతో బిజీగా ఉన్నా, రాజకీయంలో ముందుకు వెళుతున్న తన ఫ్యామిలీకి కూడా సమయం కేటాయిస్తూ ఉండటం విశేషం.
స్కూళ్ల కి దసరా సెలవలు కావటంతో తన మనవడి తో రెండు రోజులు కాలక్షేపం చేసారు.ఇక నుంచీ రాజకీయాల పై దృష్టి సారిస్తారని వినికిడి,మరోవైపు క్రమశిక్షణ రాహిత్యంతో రాష్ట్రంలో కొంత మంది రజిని అభిమానులను బహిష్కరించడంతో కొంత తలనొప్పిగా మారింది.మరో రెండు వారాల తర్వాత రజనీ నటించిన రోబో 2.0 పబ్లిసిటీ కూడా మొదలు పెడతారని తెలుస్తుంది...
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.