Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
మలైక అరోర' ఒకప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వదిన,అయితే ఒక ఏడాది క్రితమే సల్మాన్ ఖాన్ అన్న అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకున్నారు.అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తూ మీడియాకు ఎన్నోసార్లు దొరికిపోయారు.ఇప్పుడు వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
మలైకా‌ వారం రోజుల క్రితమే తన 45వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా అర్జున్ కపూర్ తో మిలాన్ చుట్టివచ్చారు.అర్జున్ కపూర్ కుటుంబంతో కూడా సన్నిహితంగా ఉండటం,కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలు మీడియా కంటపడటంతో వీరి పెళ్లి వార్త నిజమేనని అభిప్రాయపడుతున్నారు.అర్జున్,మలైకా‌కు ఒకరంటే మరొకరికి చాలా ఇష్టం. వాళ్లిద్దరు ఎప్పుడూ తమ ప్రేమ గురించి బయట మాట్లాడలేదు.చాలా ఏళ్లుగా వారి బంధం కొనసాగుతూ వస్థుంది. ఇప్పుడు ఈ వార్తను నిజం చేస్తూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి.
అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటలో,మలైకా కు 45 అర్జున్ కపూర్ కు 33 సంవత్సరాలు,12 సంవత్సరాలు చిన్నవాడైన అర్జున్ కపూర్ మలైకా లో ఏం చూసాడని కొంతమంది,అలాగే మలైకా.. అర్జున్ కపూర్ కి ఏం మాయ చేసిందో అని కొంతమంది చెవులు కొరుకుంటున్నారు.జార్జియా ఆండ్రియానితో మలైక మాజీ భర్త సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కూడా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటువంటి ప్రేమలన్నీ విచిత్రంగానే ఉంటాయి మరి.
వెస్ట్రన్ కల్చర్ను ఏనాడో పునికి పుచ్చుకున్న బాలీవుడ్ ని చూసి ఇతర ఇండస్ట్రీలు కూడా అడుగులు వేస్తున్నాయి.ఎవరు ఎవరు ఎప్పుడు విడిపోతారో తెలియదు,ఎవరిపై ఎవరికీ ప్రేమ పుడుతుందో తెలియదు.వయోభేదం అసలే లేదు.వివాహ బంధం నూరేళ్లపంట కాదు, మూడునాళ్ళ ముచ్చటే అవుతున్నాయి.డేటింగ్ పేరుతో ఒకరికొకరు కాపురాలు కూల్చుకుంటున్నారు.కొత్త కొత్త ప్రేమలతో విచిత్రాలను సృష్టిస్తున్నారు...
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.