Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఉంది పరిస్థితి,ఒక సూపర్ హిట్ సినిమా వసూలు చేసినంత బడ్జెట్టు ఆ తర్వాత సినిమాకి పెడుతున్నారు.దీనిని వాపు అనుకోవాలా.. అత్యుత్సాహం అనుకోవాలా.. బాహుబలి సినిమా అన్ని ఇండస్ట్రీలకు నిద్ర లేకుండా చేస్తుంది.ప్రతి ఇండస్ట్రీలలోను నిర్మాతలు బడ్జెట్ కి మించి సినిమాలు నిర్మిస్తున్నారు.అప్పటి వరకు జాగ్రత్తగా నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని ఒక్క సినిమాతో కుల్చుకుంటున్నారు, ఎందరో నిర్మాతలు కాలగర్భంలో కలిసిపోయారు.
అసలు పెద్ద హీరోల సేఫ్ బడ్జెట్ ఎంత,అగ్ర హీరోలకు సంబంధించి హిందీ సినిమాకి సేఫ్ బడ్జెట్ 60 కోట్లు,తెలుగు తమిళ సినిమాలకు 40 కోట్లు,కన్నడ మలయాళ సినిమాలకి 15 కోట్లు,బెంగాలీ భోజుపురి,మరాఠ,ఒరిస్సా,పంజాబీ,గుజరాతీ సినిమాలకు అయిదు కోట్లు.అయితే పైన చెప్పిన విధంగా అగ్ర హీరోలు బడ్జెట్ ఈ విధంగా ఉన్నట్లయితే అందరూ సేఫ్ గా ఉండటంతో పాటు నిర్మాత కూడా సేఫ్ గా ఉంటాడు.కథ డిమాండ్ ను బట్టి బడ్జెట్టు,24 క్రాఫ్ట్స్ ను మేనేజ్ చేస్తూ బడ్జెట్ ను నియంత్రణలో ఉంచుకోవటం ఇప్పటి నిర్మాతలకు సాధ్యం కావటం లేదు.అతికొద్ది మంది నిర్మాతలు తప్ప చాలా మంది నిర్మాతలు భారీ తనంతో భారీగా ఖర్చుపెట్టి చేతులు కాల్చుకుంటున్నారు.
హిందీ సినిమా 'ధగ్గ్స్ ఆఫ్ హిందూస్థాన్' బడ్జెట్ 250 కోట్లు,టార్గెట్ రెండు వేల కోట్లు,వచ్చింది 135 కోట్లు,ఇంకా వచ్చే పరిస్థితి కూడా లేదు.సింగిల్ స్క్రీన్స్ లలో ఈ సినిమా పరిస్థితి ఘోరంగా ఉంది.ఏడు వేలకు స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా నాలుగు రోజుల తర్వాత రెండువేల థియేటర్లలో కూడా లేదు.పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది.ఈ సినిమాకి స్టార్స్ కి కొదవలేదు,అమీర్ ఖాన్,అమితాబ్ బచ్చన్,కత్రినా కైఫ్ నటించారు మరి.భారీ తనంతో నిర్మించిన ఈ సినిమా ఈ సంవత్సరానికి అతి పెద్ద ఫ్లాప్ గా నిలిచి ఇతర సినిమాలకు డేంజర్ బెల్స్ మోగించింది.
అన్ని ఇండస్ట్రీలకు రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. హిందీ లో రాబోతున్న పెద్ద సినిమాలకు,తెలుగు లో రాబోతున్న 'సైరా నరసింహరెడ్డి' 'సాహో'సినిమాలకు,తమిళ సినిమా రోబో 2.0 కు,కన్నడ లో నిర్మించిన కే జి ఎఫ్ కు,మలయాళంలో తీస్తున్న వెయ్యి కోట్ల బడ్జెట్ మోహన్లాల్ మహాభారతానికి,ఈ సినిమా ఒక పాఠం లాంటిది.నిర్మాత సేఫ్ గా ఉంటేనే ఇండస్ట్రీ తో పాటు అందరు సేఫ్ గా ఉంటారు.కథ డిమాండ్ను బట్టి బడ్జెట్ పెట్టాలి తప్ప హీరోని బట్టి,స్టార్ కాస్ట్ బట్టి సినిమాను తీసేసి, గ్రాఫిక్స్ నింపేసి జనాల మీదకి వదిలితే ప్రజలు తిరస్కరిస్తారని గమనించాలి.హీరో ఇమేజ్కి తగ్గ రెవిన్యూ, పై సినిమాలకు సరిపోవని తేలిపోయింది.కథలో దమ్ము టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించుకొని మెస్మరైజ్ చేసే అంశాలు ఉంటేనే,రాబోయే సినిమాలన్నీ సేఫ్ మోడ్ లోకి వెళ్తాయి ఏమంటారు...
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.