Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
ఇద్దరు అగ్ర హీరోలను కలిపి దర్శకత్వం వహించడం కత్తిమీద సాములాంటిదే,అటువంటి మల్టీస్టారర్ సినిమాలు గతంలో చాలానే వచ్చాయి.ఒక హీరో ఎక్కువ,ఒక హీరో తక్కువ కాకుండా దర్శకుడు సమపాలల్లో తీయవలసి ఉంటుంది.వారి అభిమానులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.ఇప్పుడు రాజమౌళి కూడా ఈ ప్రయత్నాన్ని చేయబోతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ తో కలిపి దర్శకత్వం వహించబోతున్నారు,ఇద్దరి హీరోలను సమపాళ్లలో తీస్తాడని,రాజమౌళి పై ఆ నమ్మకం ఉందని,ఇద్దరు హీరోల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇద్దరు హీరోలను సమానమైన పాత్రలో చూపించడం అనేది దర్శకుడి ప్రతిభ మాత్రమే కాదు, అభిమానులను సైతం మెప్పించగలగాలి,అటువంటి ఇబ్బందే ఒక సినిమాకు కలిగినది.
ఆ సినిమా పేరే 'దళపతి' మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టి, రజనీకాంత్ ఇద్దరు కలిసి నటించారు.ఈ సినిమా క్లైమాక్స్ లో రజనీకాంత్ పాత్ర చనిపోతుంది ఈ వెర్షన్ నే ప్రివ్యూ వేశారు,ఆ తర్వాత రజనీకాంత్ అభిమానులు తమిళనాడు రాష్ట్రమంతటా వీరంగం సృష్టించారు, మణిరత్నం ఆఫీస్ ను ధ్వంసం చేస్తామని బెదిరించారు,తమ హీరో పాత్ర చనిపోతే మేము ఒప్పుకోమని రజనీకాంత్ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు.అయితే మణిరత్నం ఈ ఇబ్బందిని అధిగమించి రెండు రకాల క్లైమాక్స్ లతో సినిమాను రిలీజ్ చేశారు.
రజినీకాంత్ చనిపోయే పాత్రను కేరళలోనూ,మమ్ముట్టి చనిపోయే పాత్రను తమిళనాడులోను రిలీజ్ చేసి వారి అభిమానులను ఆనందపరిచారు తెలుగులో కూడా మమ్ముట్టి చనిపోయే పాత్రతోనే క్లైమాక్స్ ను రిలీజు చేశారు.ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.అయితే ఇప్పుడు రాజమౌళి అటువంటి ఇబ్బందులని ఎలా అధిగమిస్తాడో వారి అభిమానులను ఎలా మెప్పిస్తాడో చూడాలి.ఇదండీ సంగతి ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్ లు ఉండటం ఈ సినిమాకే జరిగింది.ఆ తర్వాత హిందీ సినిమా 'బాజిగర్'కి కూడా ఈ పరిస్థితి ఎదురైంది హీరో పాత్ర చనిపోతే బాగుండదని,అభిమానులు ఒప్పుకోకపోవచ్చు అని ప్రివ్యూ చూసిన వారు చెప్పటం తో దర్శకుడు రెండు రకాల క్లైమాక్స్ ని షూట్ చేశారు.అయితే చివరికి హీరో చనిపోయే పాత్రనే ఉంచి రిలీజ్ చేశారు.మరి ఇటువంటి సినిమాలు మరికొన్ని ఉంటే మాకు తెలియజేయండి..
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 0
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.