Forgot your password?

Enter the email address for your account and we'll send you a verification to reset your password.

Your email address
Your new password
Cancel
తెలుగు సినిమా ఉన్నంత కాలం తన పేరును చిరస్థాయిగా లిఖించుకున్న హీరో చిరంజీవి, బాక్సాఫీస్ ని షేక్ చేసిన హీరో, కొన్నేళ్లపాటు ప్లాప్ సినిమాలకు సైతం నిర్మాతలకి కాసులు కురిపించిన హీరో,10 సంవత్సరాల వ్యవధిలోనే ఏకంగా ఏడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి మొత్తంగా ఎనిమిది ఇండస్ట్రీ హిట్ లతో అందరికంటే టాప్ లో కూర్చున్నాడు.అవి ఏవిధంగా బీట్ చేసాడో ఒకసారి చూడండి..చిరంజీవి ఇండస్ట్రీ కి వచ్చే ముందు అది1977 సంవత్సరం ఎన్టీ రామారావు తన సినిమా 'అడవి రాముడు'తో మూడు కోట్ల కలెక్షన్లు సాధించి అంత ముందు ఉన్న కృష్ణ సినిమా అల్లూరి 'సీతారామరాజు'రికార్డ్ ని తుడిచిపెట్టి టాప్ లో కూర్చున్నాడు.
ఆ తర్వాత ఐదు సంవత్సరాలకి ఏఎన్నార్ నటించిన' ప్రేమాభిషేకం'తో 3.5 కోట్లు కొల్లగొట్టి పైచేయి సాధించాడు,ఈ ఐదేళ్ల కాలంలో చిరంజీవి విలన్ సెకండ్ హీరో పాత్రలు వేసి హీరోగా మారాడు..1983లో ఖైదీ సినిమా తో నాలుగు కోట్ల రూపాయలను సాధించి 35 సంవత్సరాలపాటు ఏఎన్నార్,ఎన్టీఆర్, కృష్ణ లకు మాత్రమే ఉన్న రికార్డులను మొదటిసారి చిరంజీవి బీట్ చేసి రికార్డు సృష్టించాడు.
ఆ తర్వాత ఏ హీరో కూడా ఈ రికార్డును చెరపలేదు, తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ ఆరు సంవత్సరాల పాటు నాలుగు ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసి టాప్ చైర్ లొ కూర్చున్నాడు.87లో పసివాడి ప్రాణం 4.5 కోట్లు సాధించి నాలుగేళ్ల పాటు ఉన్న ఖైదీ రికార్డును తుడిచిపెట్టింది,88లో 'యముడికి మొగుడు' సినిమా 5 కోట్లు తో పైచేయి సాధించింది, ఆ తర్వాత 89 లో 5.25 కోట్లు సాధించి 'అత్త యముడు అమ్మాయికి మొగుడు' సినిమా కొద్ది తేడాతో రికార్డు సాధించింది.
అదే ఏడాది మూడు నెలల వ్యవధిలో బాలకృష్ణ నటించిన 'ముద్దుల మామయ్య' 5.5 కోట్లు సాధించి మొదటిసారి చిరంజీవికి పోటీగా వచ్చాడు,అదే ఏడాది నాగార్జున నటించిన శివ సినిమా కూడా రికార్డే కానీ నిర్మాతలు ప్రకటించలేదు,ట్రేడ్ లెక్కల ప్రకారం శివ సినిమా 5.7 కోట్లు కొల్లగొట్టింది.వీటిని ఏడాది కాలంలోనే చిరంజీవి'జగదేకవీరుడు అతిలోకసుందరి'తో 6.2 కోట్లు సాధించి పైచేయి సాధించారు.92లో మళ్ళీ తనే 'గ్యాంగ్ లీడర్' సినిమాతో 7.5 కోట్ల మార్కును సెట్ చేశాడు.90 వ దశకం వచ్చేవరకు సినిమా టికెట్ రేట్లు తక్కువగా ఉండేవి,నేల టిక్కెట్ రూపాయి,బాల్కనీ 5నుంచి 10 రూపాయలు ఉండేది,అప్పట్లో ఐదు కోట్లు అంటే ఇప్పుడు 100 కోట్ల తో సమానం,
మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు వార్తల కోసం " Lopscoop App " ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మరియు సోషల్ మీడియాలో షేర్స్ చేయడం ద్వారా డబ్బు సంపాదించండి
YOUR REACTION
  • 0
  • 1
  • 0
  • 0
  • 0
  • 0

Add you Response

  • Please add your comment.